ఇక సినిమా మొత్తం బిజినెస్ రూ.300 కోట్ల వరకు చేసిందని అంటున్నారు. ఇటీవలి కాలంలో విడుదలకు ఎంతో ముందుగా ఇంతటి స్థాయిలో బిజినెస్ జరగడం ఒక సంచలన సంఘటనగానే చెబుతున్నారు. కాగా, అమీర్ ఖాన్ సరసన అనుష్క శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే డిసెంబర్ 19వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మరోవైపు.. పీకే చిత్రం ఫస్ట్ లుక్తో అమీర్ అలా అందర్నీ తనవైపు తిప్పుకున్న విషయం తెల్సిందే. ఒంటిమీద నూలు పోగన్నది లేకుండా, కేవలం ఓ రేడియోని "అక్కడ" ఆచ్చాదనగా ఉంచుకుని, సీరియస్గా చూస్తున్న అమీర్ పోజు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఇందులో అమీర్ గ్రహాంతరవాసిగా నటిస్తున్నట్టు సమాచారం.