తమిళంలో 'అంజాన్' చిత్రంతో ఎదురుదెబ్బ తగలడంతో టాలీవుడ్ బ్యూటీ సమంత చూపు తిరిగి తెలుగు చిత్ర పరిశ్రమ వైపు పడింది. అత్తారింటికి దారేది చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత తెలుగులో ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. తమిళంలో అంగీకరించిన చిత్రాలతో బిజీగా మారిన ఈమె.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమా షూటింగులో పాల్గొననుంది.
ఇక ప్రస్తుతం తాను విజయ్ హీరోగా రూపొందుతున్న 'కత్తి' తమిళ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం సమంతా నెల్లూరులో ఉంది. అక్కడ క్లైమాక్స్ దృశ్యాలను దర్శకుడు మురుగదాస్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. కాగా, ఇటీవల సూర్యాతో కలసి సమంతా నటించిన 'అంజాన్' సినిమా భారీ అపజయాన్ని నమోదు చేసిన సంగతి విదితమే!