పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్న - వింటున్న మాట. మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. పెళ్లి కలకాలం గుర్తు ఉండే మధుర స్వప్నం. అలాంటి పెళ్లిని ప్రతి ఒక్కరూ ఆడంబరంగా, తమకు నచ్చిన వారితో చేసుకోవాలని భావిస్తుంటారు.
కానీ, ఓ నటి మాత్రం పిల్లిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఆ హీరోయిన్ పేరు వాణీ కపూర్. 'ఆహా కళ్యాణం' అనే చిత్రం ద్వారా తమిళం, తెలుగు భాషల్లో పరిచయమైంది.