ఇందులో కూడా ఆమె మాస్ తరహాల పాత్ర పోషించింది. ఆమె స్టేజీపైకి ఎక్కగానే మగరాయుడిలా వున్నావని ఛోటాకెనాయుడు కామెంట్ చేస్తే, నేను అందంగా లేనా? అని పక్కవారిని అడిగింది. సూపర్ గా ఉన్నావ్ అన్నారు.. సరదాగా మాట్లాడుతూ, ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చింది ఛోటా వల్లనే. నీకు ఓ కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది. ఎక్కువ మాట్లాడకుండా క్యారెక్టర్ వినమని చెప్పారని అంది.
ఇక ఆ తర్వాత చోటా మాట్లాడుతూ, ఈసారి ఫంక్షన్‌కు వస్తే ఇలా హై హిల్స్ వేసుకుని రామాకు. నువ్వు మాకంటే హైలెవల్లో కనిపిస్తున్నావ్. చినిగిన జీన్స్ ఏమిటి? అని సరదాగా చేసిన కామెంట్‌కు.. నేను ఇలా వచ్చింది ఇన్‌స్ట్రాగ్రామ్ ఫాలోవర్స్ కోసమే అంటూ సెలవిచ్చింది. ఇలా ప్రతీసారి సోషల్ మీడియాలో వైలర్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే ఓ డ్రెస్‌లో ఇన్స్ట్రాలో పోస్ట్ చేస్తే, చాలా మంది నెటిజన్లు ఆంటీ! అని సంబోధించారు. ఈసారి నేను గ్లామర్ గాళ్‌గా కనిపిస్తున్నానుగదా! అంటూ ఆమెకు ఆమే మెచ్చుకుంది. మరి నెటిజన్లు ఏమంటారో చూడాలి.