ఐతే ఆమె తొలుత పవన్ కళ్యాణ్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించింది కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దానితో అన్నపూర్ణ స్టూడియోస్ వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ వస్తున్నారు. తన వ్యాపార దక్షతతో స్టూడియోకు ఓ కార్పొరెట్ లుక్కును తెచ్చేశారు. కానీ స్టూడియోలో కొందరిపై చిన్నాపెద్దా తేడా లేకుండా మాట్లాడేస్తుంటారనే విమర్శలు వస్తున్నాయి.
తుస్కారం మాటలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారనే విమర్శలున్నాయి. ఈమె మాటలను భరించలేని కొందరు తమతమ చిత్రం షూటింగులను రామోజీ ఫిలిం సిటీకి మార్చేసుకుంటున్నారట. దీనితో అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగులు పలుచబడిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె కాస్త సంయమనం పాటిస్తే అటు స్టూడియోకు ఇటు వ్యాపారానికి మంచిదనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి.