యాంకర్ అనసూయ ఈ సినిమాపై కామెంట్ చేశారు. అర్జున్ రెడ్డి కథ తనది అంటూ నాగరాజు అనే రచయిత, దర్శకుడు ఫ్రేమ్‌లోకి వచ్చి తన కథని ఒక పోర్న్ సినిమా స్థాయిలో మార్చేశారని ఫిల్మ్ చాంబర్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ, కాంగ్రెస్ మహిళా నాయకులు, మహిళా సంఘాలు అర్జున్ రెడ్డి వివాదాన్ని పెంచాయి.
ఈ వివాదాలతో ఈ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అవుతూ జనాలు సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. కేవలం వివాదాలతో, యూత్‌కి నచ్చే బూతులతో సినిమా మొత్తం నడిపించేసి, అర్జున్ రెడ్డికి వచ్చిన బజ్‌తో కలెక్షన్ పొందాలనుకోవడం నిజంగా సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈ సినిమా దర్శకుడు మాత్రం విభిన్నంగా స్పందించాడు. సందీప్‌తో సినిమా చెయ్యడం కోసం ఇప్పుడు పెద్ద హీరోలు సైతం క్యూ కట్టేసే పరిస్థితి ఉంది. అయితే సందీప్ మాత్రం కాస్త సీరియస్ అయ్యాడు. తనను అడ్డుకోవాలని చూస్తే తాను తెలుగు సినిమాలను పక్కనబెట్టి.. బాలీవుడ్‌కు వెళ్ళిపోతానని చెప్పాడు. హిందీ, భోజ్‌పురి, కన్నడ... ఇలా ఏ భాషలో అయినా సినిమాలు తీసుకుంటానని వెల్లడించారు.