బాహుబలి చిత్రంలో కత్తులు తిప్పుతూ, ఒళ్లు జలదరించే యుద్ధ విన్యాసాలు చేసిన దేవసేన అనుష్కకు చేదు అనుభవాలు కూడా వున్నాయట. అదేంటి... ఎప్పుడూ నవ్వుతూ స్వీటుగా కనబడే అనుష్కకు చేదు అనుభవాలా అని మీరనుకోవచ్చు. మనిషన్నాక... చేదు-తీపి జ్ఞాపకాలు మామూలే కదండీ. అలాంటివే అనుష్కకు కూడా వున్నాయట. ఇంతకీ ఏంటయా అవీ అంటే.. తారామణుల జీవితాలు పైకి కనిపించినంత అందంగా వుండని అంటోంది.
అంతేకాదు... సినిమాల కోసం తాము చాలా కష్టపడుతుంటామనీ, మేకప్ వేసుకునేందుకు గంటలకొద్దీ ఉండాల్సి వస్తుందనీ, కష్టపడాల్సి వస్తుందని చెపుతోంది. అలా అన్నీ సరిచేసుకుని సినిమా షూటింగ్ ముగిసి ఇంటికి వెళ్లేసరికి శరీరం సహకరించదనీ, తీవ్రమైన నొప్పులు కలుగుతాయని చెపుతోంది. ఇలాంటి సమస్యలను ఇంట్లో వారికి కూడా చెప్పలేక తను ఒక్కదాన్నే గదిలో కూర్చుని ఏడ్చిన సందర్భాలు వున్నాయంటోంది స్వీటీ. నిజమే... అంత కష్టపడితేనే కదా... మనకు అంత అందమైన నటన చూస్తున్నామూ....