బాలయ్య మోనార్క్ జూన్ 10న అలా వదులుతాడట

బుధవారం, 3 జూన్ 2020 (17:31 IST)
జూన్ 10న బాలయ్య పుట్టినరోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు, సినీ ప్రియులకు ఆ అగ్ర హీరో మంచి కానుక ఇవ్వబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంతో నిర్మిస్తున్న సినిమాలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా దాని షూటింగ్ కాస్త వాయిదా పడింది.
 
ఇప్పటికే ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఆ సినిమాకి సంబంధించి టైటిల్, ఫస్ట్‌లుక్‌తో పాటు ఓ పాటను కూడా ఆ రోజున విడుదల చేయబోతున్నారు. కానీ ఇందులో విశేషం ఏమిటంటే ఆ పాట బాలయ్య ఆలపించింది కావడం. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "పైసా వసూల్" చిత్రంలో పాట పాడి అందరినీ మెప్పించిన విధంగానే ఇప్పుడు కూడా మెప్పించబోతున్నాడు. ఈ పాట రికార్డింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలకృష్ణ నా పాటతో సోషల్ మీడియాలో మళ్లీ సందడి చేయబోతున్నా అని చెప్పి క్లూ కూడా ఇచ్చేశారు. దానికి ఎంతో సమయం వేచి ఉండక్కర్లేదని, మరో నాలుగైదు రోజులు మాత్రమే అని చెప్పారు. దీన్ని బట్టి పాట రిలీజ్ చేయబోతున్నారనే విశ్వసించవచ్చు. పైగా ఈ చిత్రానికి మోనార్క్ అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు