నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విజయంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతూ వుండటంతో ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు తన తదుపరి చిత్రంపైన ఫోకస్ పెట్టారు. రైతు చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరా అని ఆలోచన చేస్తుండగా ఆ ఆఫర్ శ్రియకు ఇవ్వాలని బాలయ్య నిర్ణయించారట. ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీకి చెప్పినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.