కొద్దిరోజుల క్రితం కిడ్నాప్‌కి గురైన లైంగిక వేధింపులకు గురైన సినీనటి భావన మొదటి సారి పెదవి విప్పింది. మలయాళంకి చెందిన ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కేవలం డబ్బు కోసమే తనపై దారుణం జరగలేదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలిపింది. షూటింగ్ నుంచి నటీనటులను తీసుకెళ్ళే ఓ కారు డ్రైవర్ ఇంతటి దురాగతానికి ఎలా ఒడిగట్టాడో తెలియడం లేదని భావన చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే
ఈ నేపథ్యంలో భావన రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. జగపతిబాబు ముఖ్యమైన రోల్లో రానున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'పటేల్ ఎస్.ఐ.ఆర్'. ప్రారంభం రోజే టీజర్ రిలీజ్ చేసింది యూనిట్. అయితే, ఇందులో హీరోయిన్ భావన క్యూషియల్ రోల్ చేస్తున్నట్లు ఇన్సైడ్ సమాచారం.