ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించి, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కి, దసరా పండుగకు రిలీజ్ అయిన చిత్రం స్పైడర్. ఈ చిత్రం ఆరంభంలో నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
అయితే, ఫిల్మ్ క్రిటిక్స్‌కు టాలీవుడ్‌కు మధ్య ఓ రచ్చ చెలరేగింది. ఎలాంటి ప్రామాణిక జ్ఞానం లేకుండా కొందరు రివ్యూలు రాసి సినిమాను దెబ్బతీస్తున్నారని సినీతారలు, నిర్మాతలు విమర్శిస్తున్నారు. అలాంటి వారి మీద కేసులు కూడా పెడతామని హెచ్చరికలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్‌లో ఓ పుకారు చక్కర్లు కొడుతోంది. `స్పైడర్` సినిమాను ఎవరైనా ఫ్లాప్ అయిందని విమర్శలు చేస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుందట.
బాక్సాఫీస్ కలెక్షన్లను బహిర్గతం చేయడం కాపీరైట్ చట్టం ప్రకారం నేరమని పేర్కొంటూ ఈ నోటీసులు పంపించారట. దీని వల్ల తమ సినిమాపై నెగెటివ్ రివ్యూలు రాసే వాళ్లపై సంబంధిత చిత్ర యూనిట్ చర్యలు తీసుకునే అవకాశం దొరికిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ చిత్రం 12 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన 'ఠాగూర్' మధు ప్రకటించారు.