తీహర్ జైలుకు అరవింద్ క్రేజీవాల్...!?

గురువారం, 22 మే 2014 (09:05 IST)
FILE
బీజేపీ నేత నితిన్ గడ్కరీ పరువు నష్టం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు స్థానిక కోర్టు రెండు రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది. నితిన్ గడ్కరీ దాఖలు చేసిన నేరపూరిత పరువునష్టం దావాలో జామీను పూచీకత్తు(బెయిల్ బాండ్)ను సమర్పించడానికి నిరాకరించినందుకు ఢిల్లీ కోర్టు ఆదేశాల మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి మే 23వరకు తీహార్ జైలుకు తరలించారు.

రూ. 10 వేలకు వ్యక్తిగత బెయిల్ బాండ్ లేదా అదే మొత్తానికి ఒక పూచీకత్తును సమర్పించడానికి కేజ్రీవాల్ పదేపదే నిరాకరించడంతో ''కస్టడీలోకి తీసుకోండి'' అని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గోమనతి మనోచ బుధవారం ఆదేశించారు. ఫలితంగా పాటియాలా కోర్టు ప్రాంగణంలో కేజ్రీను అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి