చిత్ర నిర్మాతలు ఈ విషయమై సోమవారంనాడు దర్శకుడు వెంకీ అట్లూరితో చర్చించారు. ధనష్‌కు కోవిడ్ నిర్దారణ కావడంతో షూటింగ్ వాయిదా పడడంతో కంటెన్యూగా చేయాల్సిన షూటింగ్ ఆగిపోవడంతో ఇతర నటీనటుల డేట్స్ కూడా వేస్ట్గా అయిపోయేట్లు కనిపిస్తున్నాయి. అందుకే ధనుష్ లేకుండా షూటింగ్ చేసే దిశగా చిత్ర యూనిట్ ఆలోచిచస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలలోనే షూట్ ముగిసేలా దర్శకుడు వెంకీ అట్లూరికి ధనుష్ ముందుగానే కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కానీ అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడంతో మేకర్స్ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఏషియన్ ఫిలింస్ నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కమిట్ ధనుష్ చిత్రం కూడా బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు వైవాహిక జీవితం, మరోవైపు కోవిడ్ ఇబ్బంది వున్నా ధనుష్ అభిమానులు ఆయనకు అండగా వుంటూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.