శర్వానంద్ పైన రూ. 35 కోట్లు వస్తుందా? హనూ... నువ్వు మారవా?

సోమవారం, 17 డిశెంబరు 2018 (12:33 IST)
శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ప‌డి ప‌డి లేచె మ‌న‌సు. ఈ సినిమాకి హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. అయితే... హ‌ను రాఘ‌వ‌పూడి అందాల రాక్ష‌సి సినిమాని ఎంత బాగా తెర‌కెక్కించాడో తెలిసిందే. ఆ సినిమాని చెక్కుతూ తీయ‌డం వ‌ల‌న బ‌డ్జెట్ పెరిగింది. సినిమా ఫ్లాప్ అవ్వ‌డం వ‌ల‌న లాస్ వ‌చ్చింది. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా కూడా బ‌డ్జెట్ పెరిగిపోయింద‌ట. కాక‌పోతే నాని వ‌ల‌న నిర్మాత లాస్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు.
 
లై సినిమా దారుణ ఫలితాన్ని మిగిల్చింది. సినిమాకు యావరేజ్ టాక్ రాగా.. వచ్చిన వసూళ్లు బడ్జెట్లో సగం కూడా లేవు. ఆ చిత్రం మెజారిటీ షూటింగ్ అమెరికాలో చేశారు. వర్కింగ్ డేస్ పెరిగి బడ్జెట్ అదుపు తప్పింది. ఏకంగా రూ.40 కోట్ల దాకా పెట్టించేశాడు హను. దీంతో నిర్మాతలు నిండా మునిగిపోయారు. 14 రీల్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ నుంచి మళ్లీ సినిమానే రాలేదంటే ఆ సినిమా ఎఫెక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
 
తాజా చిత్రం ప‌డి ప‌డి లేచె మ‌న‌సు వ‌ర్కింగ్ డేస్ ఎక్కువ కావ‌డం వ‌ల‌న 30 కోట్లు దాటింది. ఫైనాన్స్ వ‌డ్డీలు క‌లుపుకుంటే 35 కోట్లు అయ్యింద‌ట‌. ఈ సినిమా పాజిటివ్ టాక్ ఉంది కానీ... శ‌ర్వానంద్ పైన 35 కోట్లు వ‌స్తుందా అనేది అనుమాన‌మే. హ‌ను రూటు మార్చి బ‌డ్జెట్ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి లేదంటే కెరీర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు