14 రీల్స్ ప్లస్ బ్యానరులో హరీష్‌ శంకర్ మూవీ... హీరో ఎవరు..? (video)

మంగళవారం, 19 మే 2020 (10:28 IST)
కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్‌తో 'గద్దలకొండ గణేష్' సినిమా తెరకెక్కించి.. బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. తదుపరి చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేయనున్నారు. 
 
పవన్ - హరీష్‌ కాంబినేషన్‌లో రూపొందే చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రాన్ని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. ప్రస్తుతం స్క్రిప్టు జరుగుతుంది. పవన్ 'వకీల్ సాబ్' సినిమాతో పాటు క్రిష్‌తో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత పవన్ హరీష్ శంకర్‌తో సినిమా చేయనున్నారు.
 
 
 
ఇదిలావుంటే... 14 రీల్స్ ప్లస్ సంస్థ హరీష్‌ శంకర్‌తో సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసింది. ఈ సినిమా గురించి హరీష్‌ శంకర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. చాలా ఎక్సైట్ అవుతున్నట్టు తెలియచేస్తూ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. అయితే.. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాలో హీరో ఎవరు..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. 
 
లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమాలో హీరో ఎవరు..? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? ఇలా అన్ని వివరాలను ప్రకటిస్తామన్నారు. హరీష్ శంకర్... మహేష్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్టు గతంలో ప్రకటించారు.
 
 మరి... 14 రీల్స్ ప్లస్ సంస్థ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మహేష్‌ మూవీ ప్లాన్ చేసిందా..? లేక వేరే హీరోతో ప్లాన్ చేసిందా..? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు