కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ఫ్లాట్‌ఫాం సినిమాల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సంపత్ నంది ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడని తెలిసింది. ఈషా రెబ్బ లీడ్ రోల్‌లో నటించనున్న ఈ సినిమా రాత్రివేళ హైదరాబాద్ జీవనశైలిని ప్రతిబింబించే విధంగా సాగుతుందని తెలుస్తోంది.