బాలీవుడ్ సుందరాంగి సోనమ్ కపూర్.. అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. భారీ ఆఫర్లతో షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న సోనమ్ కపూర్.. వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో రిలేషన్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై సోనమ్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తాజాగా తన ప్రేమ వ్యవహారంపై ఆసక్తికరమైన విషయాన్ని సోనమ్ కపూర్ బయటపెట్టింది.
కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సోనమ్ కపూర్ తన ప్రేమాయణానికి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా మీరు ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కదా! అని సోనమ్‌ని కరణ్‌జోహర్ అడిగాడు. దానికి బదులిచ్చిన సోనమ్.. ''లండన్‌కి చెందిన వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నా. ఈ విషయాన్ని అక్కడితోనే వదిలేయండని బదులిచ్చింది.