సినీ ఛాన్సులు రావడం లేదు.. రాజకీయాల్లో పనిచేద్దాం : అనుచరులతో నమిత

శనివారం, 7 జనవరి 2017 (07:07 IST)
దర్శకుడు శ్రీను వైట్ల 'సొంతం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నమిత.. ఆ తర్వాత టాలీవుడ్ కంటే కోలీవుడ్‌లోనే బాగా పాపులర్ అయ్యింది. ఈమె నటనతో కాకుండా.. వెండితెరపై తన అందచందాలను ఆరబోసి.. సినీ ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకుంది. 
 
నిజానికి వెండితెరకు పరిచయమైన కొత్తల్లో నమిత సన్నజాజి తీగలా ఉండేది. రానురాను బొద్దుగా మారిపోవడంతో తెలుగులో ఆఫర్లు దూరమయ్యాయి. దాంతో చెన్నైకి మకాం మార్చేసింది ఈ బొద్దుగుమ్మ. బొద్దుగా వుండే హీరోయిన్లని నెత్తిన పెట్టుకునే తమిళ తంబీలు, ఈమెకు గుడి కట్టి అభిమానించారు. 
 
దీంతో అడపాదడపా సినిమాలు చేస్తూ చెన్నైలో సెటిలైపోయింది. అక్కడా సినిమాలు తగ్గడంతో నమితకి మరో తలనొప్పి మొదలైంది. చెన్నైలో ఇప్పటికీ అద్దె ఇంటిలో వుంటున్న నమితకి ఇంటి యజమాని నుంచి వేధింపులు మొదలయ్యాయట. ఇల్లు ఖాళీ చేయాలని ఆమెని రౌడీలతో బెదిరించాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించి, తాత్కాలిక ఉపశమనం పొందారు. 
 
అయితే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు లేకపోవడంతో ఆమె ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించాలని నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే అన్నాడీఎంకే సభ్యత్వం కలిగిన నమిత.. ఇక ఆ పార్టీ తరపున జరిగే కార్యక్రమాలకు విస్తృతంగా హాజరుకావాలని నిర్ణయించిందట. ఈ లెక్కన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బొద్దుగుమ్మ ఆ పార్టీ తరపున ముమ్మరంగా ప్రచారం చేయడం ఖాయంగా తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి