రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత సినీ ఆఫర్ల కోసం ఎంతకైనా దిగజారుతారని, ముఖ్యంగా.. పడక గదుల్లోకి కూడా దూరుతారని, కానీ, అలాంటి అలవాటు తనకు లేదని గోవా బ్యూటీ ఇలియానా అంటోంది. అలాగే, టాలీవుడ్‌కు చెందిన ఓ దర్శకుడు తనను మోసం చేశాడనీ, అందుకే ఇపుడు ఆఫర్లు లేక ఇంటికి పరిమితమైనట్టు చెప్పుకొచ్చింది.
దీనిపై ఆమె స్పందిస్తూ సినీ ఆఫర్ల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు నాది కాదు. అవకాశాల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతారు. ఛాన్సులు ఇవ్వమని ఎవరినీ ప్రాధేయపడను. అందుకే అవకాశాలు తగ్గాయి తప్ప మరో కారణం కాదని చెప్పుకొచ్చింది. అలాగే, అవకాశాలు లేకపోయినా సరే కానీ ఏ పాత్ర పడితే అది చేయను. డబ్బుల కోసం నాసిరకం పాత్రలు ధరించను. అలా చేయడం ద్వారా తనకు ఉన్న ప్రతిష్ట దెబ్బ తింటుంది అని ఇలియానా స్పష్టం చేసింది.