ఫొటోగ్రాఫర్‌తోనే మూడురాత్రలకు సిద్ధమట!

సోమవారం, 29 సెప్టెంబరు 2014 (19:25 IST)
ఫొటోగ్రాఫర్‌ సినిమాల్లో హీరోయిన్‌లను బాగా అందంగా చూపిస్తారు. నటి ఇలియానా కూడా తనకు ఫోటోగ్రాఫర్‌ అంటే గౌరవం అంటుంది. తన కెరీర్‌లో ముందు నుంచి గైడెన్స్‌ ఇచ్చిన ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో మూడు రాత్రులు గడిపేందుకు సిద్ధమైంది.
 
అంటే.. అతడిని పెండ్లి చేసుకోనున్నదని వార్త బాలీవుడ్‌లో హల్‌‌చల్‌ చేస్తుంది. ఇప్పటికే పెళ్లీడు వయస్సు వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఏ విషయాన్ని త్వరలో తెలియజేస్తానని వెల్లడించింది. 
 
తెలుగు, తమిళ, మలయాళం, హిందీల్లోనూ పలు చిత్రాల్లో నటించిన ఈమె ప్రస్తుతం సినిమాలను తగ్గించుకుంది. పెండ్లి తర్వాత ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం లేకపోలేదని చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి