సూపర్ స్టార్ రజనీకాంత్ తన నటనకు గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో నెలకొంది. ఆమధ్య కోవిడ్ పాజిటివ్‌కు గురికావడం ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడం జరిగింది. కోలుకున్నాక తిరిగి `అన్నాత్తే` సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ ఫిలింసిటీకి వచ్చారు. అక్కడ 15రోజులు షూటింగ్ ముగించుకుని తిరిగి చెన్నై వెళ్ళిపోయారు. కాగా, హైదరాబాద్ షూటింగ్‌లో దర్శకుడితో మాట్లాడుతూ ఇకనుంచి నటనకు దూరంగా వుండాలనుకుంటున్నట్లు సంభాషణలు జరిగాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కు చెందినవారు లీక్ చేశారని కోలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.