ప్రముఖ నటి మీనా రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే ఆ దుఃఖం నుంచి కోలుకుంటున్నారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.