ఒకప్పడు ఇద్దరు పేరున్న హీరోలు.. ఎడమొహంపెడమొహంగా వుండేవారు. మీడియా వారికి అది మంచి రుచిరకమైన వార్తగా వుండేది. కానీ ఇప్పటి ట్రెండ్ అందుకు విరుద్ధంగా వున్నారు. జనరేషన్ మార్పే దానికి కారణంగా చెబుతుంటారు. మా తరానికి ఇప్పటి తరానికి చాలా తేడా వుందనీ, ఇప్పటితరం ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటారనీ, ఒకరి క్షేమం మరొకరు కోరుకుంటారని.. ఇటీవలే మోహన్ బాబు వ్యాఖ్యానించారు.
ఒకరి సినిమా విడుదలైతే ఆ సినిమా గురించి వీరితో మాట్లాడుతుంటారు కూడా. ఒకరి సినిమాకి మరొకరు క్లాప్ కొడుతుంటారు. వీలుంటే ఒకరి సినిమాకి మరొకరు వాయిస్ ఓవర్ అందిస్తుంటారు. కాగా సినిమాల పరంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ వాస్తవానికి రియల్ లైఫ్‌లో వారిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్.