ఇప్పటి కొత్త తరంతో పోటీ పడలేకనో, కొత్త ఒక వింతగా దర్శక నిర్మాతలు భావించడం వల్లనో ఆమెకు ఛాన్స్‌లు లేవు. అటువంటిది.. మహేష్ బాబు పక్కన బ్రహ్మూత్సవంలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ ఇందులో సమంత తర్వాత స్థానం ఆమెది. అంటే సెకండ్ హీరోయిన్. దీనికైనా ఆమె అంగీకరించిందంటే.. ఆమె కెరీర్ ఏ స్థాయికి చేరిందో అని గుసగుసలాడుకుంటున్నారు. కాగా, టెంపర్ సమయంలోనే కాజల్.. ఓ సందర్భంలో మాట్లాడుతూ... ఈ రంగంలో ఎంతకాలం వుంటానో చెప్పలేను కానీ, వున్నంతకాలం నాకిచ్చిన పాత్రకు న్యాయం చేస్తానని తెలియజేసింది.