నిజానికి కిక్ 2 మీద కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. పటాస్‌కు ముందు కళ్యాణ్ చాలా దెబ్బలు తిన్నాడు. అయితే తనకు వ్యక్తిగతంగా ఉన్న పేరుతో నిలదొక్కుకున్నాడు. పటాస్‌తో లాభాలు కళ్ల చూసాడు. కానీ కిక్ 2 మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. రూ. 40 కోట్ల వరకు ఖర్చు చేసేసాడట. ఈ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డిని గుడ్డిగా నమ్మి, తన పరిస్థితి ఏమిటో చూసుకోకుండానే, రవితేజ మార్కెట్ ను కూడా పట్టించుకోకుండా ఖర్చు చేసేశాడట.