కీర్తి సురేష్... అనతి కాలంలోనే దక్షిణాదిలో బాగా పాపులర్ అయిన మలయాళ ముద్దుగుమ్మ. నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అందర్నీ ఆకట్టుకుంది. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించి తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుంది. మహానటి సినిమాలో కీర్తి అద్భుత నటనతో తన కీర్తి దశ దిశలా వ్యాపించింది. దీంతో ఎన్నో ఆఫర్స్ ఆమె వెంటపడ్డాయి.
అలా వచ్చిందే.. జయలలిత పాత్ర పోషించమనే ఆఫర్. అయితే... ఈ పాత్ర పోషించేందుకు కీర్తి సురేష్ నో చెప్పిందట. దీనికి కారణం ఏంటని కీర్తి సురేష్‌ని అడిగితే... అమ్మ.. అదేనండి జయలలిత పాత్ర చేసే ధైర్యం తనకు లేదని స్పష్టం చేసింది కీర్తి. నటిగా, రాజకీయ నాయకురాలిగా గొప్ప పేరు తెచ్చుకున్న ఆవిడ పాత్ర చేయాలంటే ఎంతో పరిణితి కావాలని అంటోంది. అంతేనా... లేక వేరే కారణం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి వుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... జయలలిత పాత్ర కోసం అనుష్కను సంప్రదించారట. అదీ.. సంగతి.