అవినాష్‌- అరియానాల మధ్య ఏముంది..? పెళ్లెప్పుడు..?

గురువారం, 22 ఏప్రియల్ 2021 (11:46 IST)
Mukku Avinash_Ariyana Glory
జబర్ధస్త్ కార్యక్రమంతో పాపులర్ అయిన అవినాష్ ఇప్పుడు ముక్కు అవినాష్‌గా పిలవబడుతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కమెడీయన్ తన పర్‌ఫార్మెన్స్‌తో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇక హౌజ్‌లో ఉన్నన్ని రోజులు అరియానాతో పులి హోర కలుపుతూ ఇద్దరి మధ్య ఏదో ఉందే అనుమానం కలిగించాడు. బయటకు వచ్చాక కూడా ఇద్దరి మధ్య బాండింగ్ అలానే కంటిన్యూ అవుతుంది.
 
బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు అవినాష్ తన పెళ్లి ప్రస్తావన పదే పదే తెచ్చేవాడు. నాకు పెళ్లి జరగట్లేదని తెగ ఫీలయ్యేవాడు. ఓ సారి అవినాష్ తల్లి హౌజ్‌లోకి వచ్చినప్పుడు బయటకు వచ్చాకు మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తానని సముదాయించింది. కట్ చేస్తే ప్రస్తుతం అవినాష్ పెళ్లి విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 
 
అవినాష్‌- అరియానా మధ్య బాండింగ్ బలపడిందని, 2021లోనే వీరిద్దరి వివాహం ఉంటుందని సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. అయితే వీటిని అవినాష్‌, అరియానా సన్నిహితులు ఖండిస్తున్నారు. వారిద్దరు మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటున్నారు. నిజం ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు