రామ్ చరణ్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్‌కి వచ్చి చిరుతో కథా చర్చలు సాగించినట్టు సమాచారం. ప్రస్తుతం మణిరత్నం కార్తీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పూర్తి కాకముందే మణి మరో చిత్రం గురించి కసరత్తులు చేస్తున్నారు.
అందులో భాగంగానే రామ్ చరణ్‌తో సినిమా తెరపైకొచ్చింది. ఇటీవల చెర్రీకి మణి కథని వినిపించినట్టు సినీ వర్గాలు అంటున్నారు. మణిరత్నం తనతో సినిమా చేయడం చెర్రీ తన అదృష్టంగా భావిస్తున్నాడు. ఇందుకు సంబంధించి వీరి మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం చరణ్ 'ధ్రువ' సినిమాలో నటిస్తున్నాడు. దాని తర్వాత సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మణి కాంబినేషన్లో చిత్రం ఉంటుందని సినీ పండితులు అంటున్నారు.