నాగార్జున, సోనాలి బెంద్రే నటించిన మన్మథుడు చిత్రం ఎన్నిసార్లు చూసినా ఇంకా చూద్దాం అనేంత ఆసక్తిగా వుంటుంది. అలాంటిది మన్మథుడు 2 చిత్రం చూసేందుకు వెళ్లిన ప్రేక్షకుడు ఎప్పుడు కుర్చీ లోనుంచి లేచిపోదామా అని ఆత్రుతపడ్డాడంటే ఆ చిత్రం ఎంత చెత్తగా వుందో అర్థం చేసుకోవచ్చు. మన్మథుడు 2 చిత్రం ఆహా ఓహో అన్నారు కానీ అది నాగార్జునకు విపరీతమైన విమర్శలను మోసుకు వచ్చింది.
ఇకపోతే ఈ చిత్రాన్ని ఇటీవలే ఓ ఛానల్ వాళ్లు టీవీలో వేసారు. మన్మథుడు 2 చిత్రం అనగానే, పెద్దలంతా టీవీలను టపుక్కున ఆపేశారట. ఎందుకంటే ఆ చిత్రంలో వున్న సీన్లు అట్లాంటివి. ఇలా మన్మథుడు 2 అటు పెద్ద తెరపైన ఇటు బుల్లి తెరపైన ఘోరంగా విఫలమైంది. మరోవైపు మన్మథుడు 2 చిత్రం చూసిన తర్వాత నాగార్జున కోడలు సమంత కూడా అసంతృప్తి వ్యక్తం చేశారట.