చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అనతి కాలంలోనే నటిగా మంచి స్థాయికి చేరుకున్న అమలాపాల్ అతి తక్కువ కాలంలోనే ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యిపోయింది. నీలతారమ అనే మలయాళం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయిన ఈ సుందరి ఆ తర్వాత కోలీవుడ్లో, టాలీవుడ్ అంటూ బహుబాషా నటిగా అగ్ర తారల సరసన చేరింది.
నాయక్, బెజవాడ, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల అభిమాన్ని చూరగొన్న ఈ మలయాళీ ముద్దు గుమ్మ దర్శకుడు విజయ్ను ప్రేమించి జీవిత భాగస్వామిగా చేసుకుని సెటిల్ అయింది. మంచి అవకాశాలు వస్తే నటించేందుకు తాను సిద్దమే అంటున్న ఈ అమ్మడు ఇంకా పెళ్లి కాని హీరోయిన్లను త్వరగా పెళ్లి చేసుకుని భర్త, భాందవ్యాలు అంటూ వైవాహిక జీవితంలోని మధురానుభూతులను చచిచూడండి అంటూ హితబోధలు చేస్తోంది.