మెగా ఫ్యామిలీ నుంచి హీరోలే కాదు హీరోయిన్లు తమ సత్తాచాటుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఇప్పటికే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఈమెకు సినిమాలు, నటన అంటే చాలా ఇష్టం. దాంతో నిహారిక బుల్లితెరపై ఫోకస్ పెట్టింది. అటు బుల్లి తెరపైన ప్రేక్షకులను అలరిస్తూనే, వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మల్లెల తీరంలో 'సిరిమల్లె పువ్వు' సినిమా దర్శకుడు జి.వి. రామరాజు దర్శకత్వంలో ఒక మనసు అనే సినిమా చేస్తోన్న నిహారిక యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.
కెమెరా అనుభవం ఉన్న నిహారిక ఎటువంటి బెదురూ లేకుండా నటన ఇరగదీస్తోంది. అలాగే అందానికి అందం, డైలాగ్ డెలివరీలో పర్ఫెక్షన్ ఉండటం వల్ల అందరూ అమ్మాయిని తెగ మెచ్చుకుంటున్నారు. పైగా నిహారిక చేసిన ఈ వెబ్ సిరీస్‌కు భారీ స్థాయిలోనే రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన రెండు రోజులకే ఈ ఎపిసోడ్ 64,556 హిట్లు సాధించింది. మొత్తానికి మెగా ఫ్యామిలీ అమ్మాయి దుమ్మురేపుతోంది.