ఆత్మకథ అంటే సంచలనాలే వెలికి వస్తుంటాయని ఎప్పుడో రాసిన మహాత్మా గాంధీజి ఆత్మకథ నుండి మొన్నామధ్య విడుదల చేసిన సచిన్ టెండూల్కర్ కూడా నిరూపించారు. ఇపుడు తాజాగా టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దీనిపై దృష్టి సారించారట. తను ఫీల్డులోకి ఎంటరైన దగ్గర్నుంచి ప్రస్తుతం వరకూ 600 పేజీలతో కూడిన తన ఆత్మకథను రాసేందుకు నడుం బిగించినట్లు టాలీవుడ్ న్యూస్.
అలాగే సినీ ఇండస్ట్రీకి రెండు కళ్లలా వెలిగిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లతోపాటు దాసరి ఎప్పుడూ విమర్శించే ఆ నలుగురు గురించి కూడా తన ఆత్మకథలో ఆవిష్కరించబోతున్నట్లు చెపుతున్నారు. మొత్తానికి మోహన్ బాబు ఆత్మకథ ఎలాంటి కోణాలను చూపిస్తుందో వెయిట్ అండ్ సీ.