నాగచైతన్య సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు ఈ రెండు చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. అయితే.. ఈ రెండు సినిమాల నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. సవ్యసాచికి ఇంకా పది రోజుల వర్క్ ఉంది. శైలజారెడ్డి అల్లుడు ఈ నెల 20కి షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. అయితే... చైతుని ఓ పది రోజుల డేట్స్ ఇమ్మని సవ్యసాచి టీమ్ అడుగుతోంది. శైలజారెడ్డి అల్లుడు టీమ్ మాత్రం మాకు ఈ నెల 20 వరకు డేట్స్ ఇచ్చారు కదా మా వర్కే చేయాలంటున్నారు.
దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చైతు ఉన్నాడు. ఇక లాభం లేదనుకుని నాన్నదే నిర్ణయాధికారం అంటూ బాల్‌ని నాగ్ కోర్టులోకి వేసేసాడు. చైతు కోరిక మేరకు నాగ్ సవ్యసాచి సినిమాని రీ-రికార్డింగ్ లేకుండా చూసాడట. మంచి కథ బాగా చేసుకోండి అని చెప్పాడట. మరి... ఇంటికి వెళ్లిన తర్వాత చైతుకి ఏం చెబుతాడో..?