నేను చేసింది చెప్పుకోవడం ఇష్టం వుండదంటున్న నిధి అగర్వాల్

సోమవారం, 18 మే 2020 (23:25 IST)
ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నిధి అగర్వార్ ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది. అంతేకాదు మజ్ను సినిమాలోను నిధి అగర్వాల్ నటించి మెప్పించింది. మాస్ హీరోయిన్‌గా ఇస్మార్ట్ గాళ్‌గా పేరు సంపాదించుకుంది. అసలు ఆ సినిమా హిట్ తరువాత ఎన్నో సినిమా అవకాశాలు నిధికి వచ్చాయి. కానీ లాక్ డౌన్ కారణంగా అవన్నీ షూటింగ్ లోనే ఆగిపోయాయి.
 
అయితే లాక్ డౌన్ సమయంలో ఎన్నో ఆసక్తికర విషయాలను చెబుతోంది నిధి అగర్వాల్. నేను ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నాను. షూటింగ్ కోసం నేను హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. విమానాశ్రయానికి వచ్చాను. అప్పుడే లాక్ డౌన్ అని ప్రకటించారు. ఇక నేరుగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను.
 
మా ఇంట్లో పప్పి కుక్కపిల్లలు చాలానే ఉన్నాయి. వాటితో హాయిగా ఆడుకుంటున్నాను. అయితే కొన్ని టివీ ఛానళ్ళలో లాక్ డౌన్ సమయంలో ప్రజలు పడుతున్న బాధలను చూశాను. నా మనస్సు తరుక్కుపోయింది. మా ఇంటికి దగ్గరలోని అనాథశ్రయాలకు వెళ్ళాను. అక్కడ మొత్తం ఆరు ఛారిటబుల్ ట్రస్టులు ఉన్నాయి.
 
కొంతమంది వలస వచ్చిన వారు కూడా ఉన్నారు. స్వంత ప్రాంతాలకు వెళ్ళలేక వారందరూ బెంగుళూరులోనే ఉండిపోయారు. కానీ వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేదు. దీంతో నేను వారికి డబ్బులు ఇచ్చాను. నా వంతు సహాయం చేశాను. అయితే చేసిన పనిని చెప్పుకోవడం నాకు ఇష్టముండదు. అందుకే నేను ఫోటోలకు ప్రచారానికి చాలా దూరంగా ఉన్నానని చెబుతోంది నిధి. 
 
లాక్ డౌన్ అయిన వెంటనే నాలుగు సినిమాల్లో నటించబోతున్నానని, తెలుగులో రెండు, హిందీ భాషలో ఒకటి, తమిళ భాషలో మరొక సినిమాలో నటిస్తున్నట్లు నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఇస్టార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా తనకు మంచి పేరు వచ్చిందని.. దీనికంతటికి ఛార్మి, పూరీ జగన్నాథ్ తనకు ఇచ్చిన అవకాశమేనంటోంది నిధి అగర్వాల్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు