పొట్టిగా, క్యూట్‌గా కనిపించే హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సినిమాలో నటించి మెప్పించిందామె. అంతకుముందు ఎన్నో సినిమాల్లోను నటించింది. కానీ తెలుగులో పెద్దగా నివేదకు ఆఫర్లు రాలేదు. అయితే 118 సినిమాలో నివేదకు మంచి అవకాశమే వచ్చింది. యువ నటుడు కళ్యాణ్ రామ్ సరసన నటించేందుకు ఆమెకు అవకాశం లభించింది.