పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పింక్ రీమేక్‌తో రీ-ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్... ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు సమాచారం.
ఎప్పటి నుంచో పవన్, చరణ్ కలిసి సినిమా చేస్తే చూడాలనుకుంటున్నారు అభిమానులు. వచ్చే సంవత్సరం ఈ భారీ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదే కనుక నిజమైతే.. మెగా ఫ్యాన్స్‌కి పండగే..!