పవన్ ట్రెండ్ సెట్ చేశాడు... ఆ హీరోయిన్‌ను సాయిధరమ్ తేజ్ అలా అడిగితే ఛీ పో అందట...

గురువారం, 2 మార్చి 2017 (17:10 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఆయన విదేశీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా పవన్ కళ్యాణ్ ఒకరకంగా ట్రెండ్ సెట్ చేశాడనే చెప్పాలి. విదేశీ స్త్రీని వివాహమాడి ప్రేమకు ఎల్లలు చెరిపేశాడు. ఇక ఇప్పుడు సాయిధరమ్ తేజ్ వంతు వచ్చినట్లుంది. సాయిధరమ్ నటించినవి వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని సినిమాలే అయినప్పటికీ అతడిపై రూమర్ల రద్దీ మాత్రం దూసుకువస్తున్నాయి. 
 
ఈ యువహీరో రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా తదితర యంగ్ హీరోయిన్లతో ప్రేమాయణం సాగిస్తున్నాడంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వచ్చాయి. వీటిని సాయిధరమ్ ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఐతే ఓ షాకింగ్ విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అదేంటయా అంటే... తను ఓ హీరోయిన్‌కు డైరెక్ట్‌గా లవ్‌ ప్రపోజ్‌ చేశానని చెప్పడమే.
 
ఆ హీరోయిన్ ఎవరో కాదు... సాయిధరమ్ తేజతో తిక్క సినిమాలో నటించిన బ్రెజిల్ నటి లారిసా. ఆమెకు ప్రపోజ్ చేయగానే... తన మనసు ఖాళీ లేదని చెప్పేసిందట. అప్పటికే తన హృదయాన్ని మరో వ్యక్తి ఆక్రమించాడనీ, అందువల్ల సారీ చెప్పేసిందట. దీనితో సాయిధరమ్ చాలా బాగోలేదనుకుంటూ మిన్నకుండిపోయాడట. అదీ సంగతి.

వెబ్దునియా పై చదవండి