టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన 'ముకుందా' చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. కానీ, రెండు చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి.
దీంతో బాలీవుడ్‌కు అడుగుపెట్టి... స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో జతకలిసి 'మెహంజదారో' చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో తన రేంజ్ పెరిగిపోవడం ఖాయమిని గంపెడాశలు పెట్టుకుంది. కానీ, 'మెహంజదారో' డిజాస్టర్ మూవీగా మారడంతో మళ్లీ టాలీవుడ్‌కు వచ్చి వాలిపోయింది.
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న 'డీజే.. దువాడ జగన్నాథం' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే పవర్ స్టార్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. అయితే, ఓ వైపు టాలీవుడ్‌లో అవకాశాలని అందుకుంటూనే ఇతర భాషల్లో ఛాన్సుల కోసం తన అందాలను ఆరబోస్తోంది.