పవన్ కళ్యాణ్ కోసం పూజా వెంటపడుతున్న స్టార్ డైరెక్టర్!

సోమవారం, 24 ఆగస్టు 2020 (17:30 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఆయన రాజకీయాలకు కాస్తంత విరామం ఇచ్చారు. ఈ గ్యాప్‌లో తనకు నచ్చిన కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ "పింక్" చిత్రం రీమేక్‌లో నటిస్తున్నారు. అలాగే, తనతో 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని నిర్మించి దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ మూవీ చేయనున్నాడు. ఈ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో హరీష్ మూవీ ప్రీప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైవున్నారు. 
 
ఈ క్రమంలో హీరోయిన్ పాత్రకు పూజ హెగ్డేను తీసుకోవాలని దర్శకుడు హరీశ్ భావిస్తున్నాడట. దాంతో ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దాదాపు ఆమె ఎంపిక పూర్తయినట్టేనని కూడా వార్తలొస్తున్నాయి. 
 
నిజానికి పూజా హెగ్డే మంచి పీక్ స్టేజ్‌లో ఉంది. ఇటీవల వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం సూపర్ హిట్ కావడంతో కథానాయిక పూజ హెగ్డేకు తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో పాటు, ప్రభాస్ పక్కన 'రాధే శ్యామ్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా పవన్‌ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు