రాజమౌళికి 13 సెంటిమెంట్‌... అందుకే బాహుబలి 15 దాకా లాగారట...

శనివారం, 25 అక్టోబరు 2014 (20:09 IST)
ప్రపంచంలో 13వ నెంబర్‌ అంటే చాలామంది భయపడతారు. పాశ్చాత్యులు అయితే మరీను. ఇంటి నెంబర్‌, వీధి నెంబర్లు కూడా వాటి పేరుతో వుండదు. ఇది తెలిసిందే. ఇక సినిమా ఇండస్ట్రీలోని సెంటిమెంట్లు గురించి వేరే చెప్పక్కర్లేదు. దర్శకుడు రాజమౌళికి 13వ నెంబర్‌ సెంటిమెంట్‌ వుందని విశ్వసనీయ సమాచారం. అందుకే 2013లో 'బాహుబలి' సినిమా కోసం ఎక్కువగా షూటింగ్‌ జరుగకుండా తాత్సారం చేశాడని ఫిలింనగర్‌లో టాక్‌ వుంది.
 
అందుకు తగినట్లే కొన్ని సంఘటనలు జరగడం.. షూటింగ్‌ వాయిదాలు పడటం జరిగింది. ఓసారి ప్రభాస్‌కు గాయాలు కావడం, మరికొన్నిసార్లు వేసిన సెట్‌ సరిలేదని మరలా వేయడం.. వంటి సంఘటనలు జరిగాయి. అయితే 2014 చిత్రాన్ని రిలీజ్‌ చేయాలంటే ఎక్కువ భాగం షూటింగ్‌ కాలేదు. అందుకే 2015 ఏప్రిల్‌లో సినిమా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశాడు. సరి సంఖ్య 8 వస్తుంది కనుక.. రాజమౌళికి సెంటిమెంట్‌కి సరిపోతుందట.

వెబ్దునియా పై చదవండి