హీరోయిన్లు టీనేజ్ దాటగానే ఆంటీల పాత్రలు వేయాల్సి వస్తుంటుంది. ఇప్పుడు సీనియర్ హీరోల పరిస్థితి కూడా అలాగే మారిపోతోంది. ఒక్క బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి వారు తప్ప మిగిలిన హీరోలు మెల్లగా బాబాయి, నాన్న పాత్రలు వేసేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే జగపతి బాబు ఒకడుగు ముందుకు వేసి విలన్ పాత్రలు వేసేందుకు సిద్ధమైపోయాడు.