తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న యంగ్ హీరోయిన్‌లలో రకుల్ ప్రీత్ సింగ్. ఏ ముహూర్తాన ఆమె తన తొలి తెలుగు సినిమా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చేసిందో కానీ, అప్పటి నుంచి వరుస అవకాశాలతో పూర్తిగా బిజీగా మారిపోయింది. ఫలితంగా టాలీవుడ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ ఫుల్ రైజింగ్‌లో ఉంది.
ఈ భామ ఇలా అగ్రహీరోయిన్‌గా ఎదిగేందుకు ముఖ్యకారణం... అందాల ఆరబోతకు అడ్డుచెప్పక పోవడమే. అలాగే, రెమ్యూనరేషన్ విషయంలోనూ పట్టువిడుపులు ప్రదర్శిస్తూ తెలివిగా అవకాశాలను దొరకపుచ్చుకుంటుంది. తన పాత్ర విషయంలో పెద్దగా బెట్టు చేయదు. అందుకే రకుల్ అంటే నిర్మాతలతో పాటు.. హీరోలందరికీ హాట్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది.
ఫలితంగానే మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్‌తో వరుసగా రెండు చిత్రాల్లో నటించి తన సత్తా చాటింది. చెర్రీతో మొదట 'బ్రూస్‌లీ' చిత్రంలో నటించగా, రెండో చిత్రం 'ధృవ'లో నటించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో రకుల్ దశ తిరిగిపోయింది. ఫలితంగా ఇతర హీరోలకు కూడా రకుల్ హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది.