మళ్లీ తెరపై కనిపించనున్న ''రారండోయ్ వేడుక చూద్దాం'' జోడీ

గురువారం, 22 ఫిబ్రవరి 2018 (11:18 IST)
''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమాలో చైతూకు జోడీగా నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని కైవసం చేసుకుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ జంట.. మళ్లీ వెండితెరపై కనిపించనుంది. 
 
గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య చైతూ-రకుల్‌కి ఓ కథ వినిపించిందని.. ఆ కథ కొత్తగా వుండటంతో ఇద్దరూ ఆ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో వున్న సినిమాలు పూర్తి చేసుకుని ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు ఈ జంట సిద్ధమవుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. 
 
మే లేదా జూన్ నెలల్లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు-మూడు తమిళ సినిమాలు రకుల్ చేతిలో వున్నాయి. ఇక నాగచైతన్య ఎస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ''శైలజా రెడ్డి అల్లుడు'' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు