మహేష్-మురుగదాస్ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైంది. రకుల్ సినిమా అంటేనే యువత పడిచస్తుంది. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఉంటే చాలు. సినిమా చూసేదాకా వదలడం లేదు. గతంలో ఈ భామ మహేష్ బాబు హీరోగా నటించిన 'బ్రహ్మోత్సవం'లో హీరోయిన్ అవకాశాన్ని చేజార్చుకుంది.
ఎట్టకేలకు ఆ అవకాశాన్ని మురుగదాస్ చిత్రం ద్వారా దక్కించుకుంది. దీనికోసం ఈ అమ్మడు సాయిధరమ్ తేజతో ఒప్పుకున్న సినిమాను కూడా రద్దుచేసుకుంది. విషయం తెలుసుకున్న సాయిధరమ్ తేజ్… రకుల్‌కు అభినందనలు చెప్పాడట. అయితే మహేష్ కోసం కేవలం సాయిధర్మతేజకే కాదు… మరో హీరోకు కూడా రకుల్ హ్యాండ్ ఇచ్చిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఆ హీరో మరెవరో కాదు లవర్ బాయ్ నితిన్.
అ..ఆ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే రకుల్‌ను కలిసిన నితిన్ ఆమెను తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్గా బుక్ చేసుకున్నాడు. కేవలం మాట తీసుకోవడం కాదు… అప్పట్లో ఆమెకు టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. కాని రకుల్ అతనికి హ్యాండ్ ఇచ్చి మహేష్‌కు కాల్షీట్లు సమర్పించుకుందట. దీంతో మరో హీరోయిన్ను వెదుక్కునే పనిలో నితిన్ ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి మహేష్ సరసన నటించడం కోసం ఏకంగా సాయిధరమ్ తేజ, నితిన్‌కు రకుల్ ప్రీత్ సింగ్ హ్యాండ్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రిన్స్ కోసం ఇద్దరు యంగ్ హీరోలకు హ్యాండ్ ఇచ్చిన రకుల్‌పై మహేష్ కరుణిస్తాడా లేదో వేచి చూడాల్సిందే.