'బిగ్ బడ్జెట్' చిత్రాల ఆఫర్లు వెల్లువు... టాలీవుడ్ నంబర్.1 హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్?

సోమవారం, 26 డిశెంబరు 2016 (09:16 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు దిగుమతి చేసుకున్న భామల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ మధ్యకాలంలో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ముఖ్యంగా.. సోకాల్డ్ బిగ్ బడ్జెట్ చిత్రాల్లో నటించే అవకాశాలను వరుసగా చేజిక్కించుకుంటున్నారు. అందుకే టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా దూసుకెళుతోంది. ఫలితంగా టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్‌ స్థానాన్ని దక్కించుకునే పనిలో ఉన్నారు. 
 
ఈ యేడాది 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు', తాజాగా 'ధృవ' చిత్రాలతో మూడు వరుస విజయాల్ని సొంతం చేసుకుని నంబర్‌వన్ స్థానానికి చేరువలో నిలిచింది. ప్రస్తుతం వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రకుల్ ఓ హీరోయిన్. ఆమె కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ చిత్రంతో పాటు.. బోయపాటి శ్రీను చిత్రం, నాగచైతన్యతో కల్యాణ్‌కృష్ణ సినిమా, సాయిధరమ్‌తేజ్ విన్నర్ చిత్రాల్లో రకుల్ నటిస్తున్నది.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ నేను ఓవర్ నైట్‌లో స్టార్‌గా మారలేదు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్టయినా సోకాల్డ్ బిగ్ బడ్జెట్ చిత్రాల నుంచి వెంటవెంటనే ఆవకాశాలు వరించలేదు. క్రమక్రమంగా భారీ చిత్రాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి అని చెపుతోంది. అయితే, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న మహేష్ బాబు చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే రకుల్ ప్రీత్‌సింగ్ టాలీవుడ్‌లో నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకోవడం లాంఛనమేనని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి