సినీ లెజెండ్ కమల్ హాసన్- నటీమణి గౌతమి బ్రేకప్ విషయం తెలిసిందే. అయితే రామరాజన్-నళిని జంట విడాకుల ద్వారా తెగతెంపులు చేసుకున్నా.. గుండెపోటుతో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రామరాజన్ను నళిని పక్కనుండి చూసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఓ పేరు సంపాదించుకున్న జంట రామరాజన్-నళిని.
రామరాజన్ ప్రస్తుతం అన్నాడీఎంకే తరపున పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. తాను ప్రేమించి పెళ్లాడిన నళినితో గతంలో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న రామరాజన్కు గుండెపోటు రావడంతో.. ఆ సమాచారం అందుకున్న నళిని తన మాజీ భర్తను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అంతేగాకుండా.. పక్కనుండి చూసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.