కత్రినా కైఫ్ ఇంటికి రణ్‌బీర్ సీక్రెట్ ట్రిప్.. ఎందుకో తెలుసా?

సోమవారం, 8 ఆగస్టు 2016 (10:34 IST)
బాలీవుడ్ హాటెస్ట్ లవ్ జంటల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన జంట రణ్‌బీర్ కపూర్ - కత్రినాకైఫ్‌లది. ఈ జంటని చూసి కుళ్ళుకున్న వాళ్ళెంతమంది ఉన్నారో వారితో పాటు ఈ జంటని చూసి మురిసిపోయినవారు లేకపోలేదు. తమ వివాహం ఎప్పుడూ అని అడిగితే మాత్రం ఈ జంట తెగ సిగ్గుపడిపోతుంటారు. కానీ వీరి గురించి ఓ ఆసక్తికర విషయం వెలువడింది. అదేంటంటే... ఎడమొహం పెడమొహంగా ఉన్న రణ్‌బీర్‌, కత్రినాలు ఈ మధ్య రహస్యంగా కలుసుకున్నారట. 
 
అది కూడా రణ్‌బీర్ స్వయంగా కత్రినాకైఫ్‌ను ఆమె ఇంట్లో కలుసుకున్నారట. కత్రినా స్నేహితురాలు ఒకరు ఆమెను కలుసుకోవడానికి వెళ్లింది. ఇద్దరు స్నేహితులూ సరదాగా ముచ్చటించుకుంటుండగా రణ్‌బీర్ ఉన్నట్టుండి ఎంట్రీ ఇచ్చాడు. కత్రినా స్నేహితురాలు ఆశ్చర్యపోయిందట.

కత్రినా మాత్రం ఏమాత్రం జంకకుండా రణబీర్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా కనిపించిండంతో ఆ స్నేహితురాలు ప్రేమికుల మధ్య తానెందుకన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోయిందట. ప్రస్తుతం రణ్‌బీర్, కత్రినా కలిసి అనురాగ్ బసు చిత్రం 'జగ్గాజాసూస్'లో నటిస్తున్నారు. కానీ వీరిద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకోనంతగా గొడవపడిన అనంతరం ఎలా కలుసుకున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి