టెలివిజన్‌లో షోలో సుధీర్, రష్మీ జంట సందడి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, దానితో ప్రేక్షకులను, జడ్జిలను ఎంటర్‌టైన్ చేస్తుంటారు. ఇది నిర్వాహకులకు బాగా కలిసివచ్చిన అంశం. ఇద్దరి మధ్య వున్న ప్రేమ అనండి, మరోటి అనండి. దాన్ని కేష్ చేసుకునేందుకు ప్రత్యేకమైన స్కిట్‌ను తయారుచేయమని చెబుతున్నారట. గతంలో ఇలానే వీరిద్దరి ఉత్తుత్తి పెళ్లికి తెలుగు పండగనాడు నానా హడావుడి చేశారు. తాజాగా వీరిద్దరితోపాటు మరో జంట తోడయింది. కేవలం తమను తాము ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఆది కూడా ఈ రూటులోనే వచ్చాడు.