ఒకప్పటి బాలీవుడ్ కథానాయిక రవీనా టాండన్ త్వరలో పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టోగా మారబోతుంది. ఆశ్చర్యంగా ఉందా..? అవును. రవీనా టాండన్ బేనజీర్ భుట్టోగా నటించడానికి సిద్ధమవుతోంది. అయితే బాలీవుడ్లో ఇప్పటికే బయోగ్రఫీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవలే ప్రియాంకా చోప్రా 'మేరికోమ్' పాత్రలో నటించి సంచలనాలు సృష్టించింది.