జరగాల్సిన డ్యామేజ్ జరిగింది... ఇపుడు చెప్పేందుకు ఏమీలేదు : భరత్ మరణంపై హీరో రవితేజ

ఆదివారం, 2 జులై 2017 (11:47 IST)
తన సోదరుడు భర్త మరణం, అంత్యక్రియల సమయంలో తమ ఫ్యామిలీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనీ, ఇకపై దీని గురించి మాట్లాడాల్సింది, చెప్పాల్సిందేమీ లేదని హీరో రవితేజ అన్నారు. ఆయన తాజాగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో మరణించిన వేళ, కనీసం అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదన్న నిందను మోయాల్సి రావడం తనకెంతో బాధను కలిగించిందన్నారు. తాము ఏ పరిస్థితిలో ఉన్నామో కూడా చూడకుండా, సామాజిక మాధ్యమాల్లో హిట్స్ కోసం రాద్ధాంతం చేశారని, ఎంతమాత్రమూ ఆలోచించకుండా నిందలు వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
తమ్ముడి కర్మకాండలు అపరిచితులతో చేయించలేదని, తన తల్లి సోదరి భర్తతోనే చేయించామని, ఆయన ఎవరో తెలుసుకోకుండానే, భరత్‌ను అనాథను చేశామని చెబుతూ తన కుటుంబాన్ని అవమానించారని వాపోయాడు. ఇక భరత్ మరణించిన రోజు షూటింగ్‌లో ఎంతో మంది డేట్స్ ఉన్నాయని, ఇది కోట్ల వ్యాపారమని, ఒక్కరోజు తేడా జరిగినా నిర్మాత నష్టపోతాడన్న ఆలోచనతోనే బాధను మనసులోనే దిగమింగుకుని షూటింగ్‌కు వెళ్లినట్టు తన చర్యను సమర్థించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి